News November 3, 2024

వాకాడు: తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్

image

వాకాడు మండల పరిధిలోని శ్రీనివాసపురం గిరిజన కాలనీలో కొడుకు తండ్రిని కొట్టి చంపిన కేసులో నిందితుడు తుపాకుల రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. వాకాడు సీఐ హుస్సేన్ బాషా మాట్లాడుతూ.. తుపాకుల రమేశ్ మద్యానికి బానిసై తన కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో నిత్యం గొడవలు పడుతూ పలువురిని గాయపరచిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.

Similar News

News January 13, 2026

నెల్లూరు జిల్లాలో చైనా మాంజాలు నిషేధం: SP

image

నెల్లూరు జిల్లాలో చైనా మాంజా వాడకాన్ని నిషేధిస్తున్నామని ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల వెల్లడించారు. ‘సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ. అందరూ సంతోషంగా పతంగులు ఎగరవేయాలి. చైనా మాంజా(దారం) వాడకంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ దారాలు అమ్మడం చట్టరీత్యా నేరం. ఎక్కడైనా ఆ మాంజాను విక్రయిస్తే 100కు డయల్ చేయండి’ అని ఎస్పీ కోరారు.

News January 13, 2026

నెల్లూరు ఎస్పీ హెచ్చరికలు ఇవే..!

image

సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, జూదాన్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జూదాలు నిర్వహంచినా, అందులో పాల్గొన్నా కేసులు తప్పవని చెప్పారు. ఎక్కడైనా కోడి పందెం, జూద శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే 112కు కాల్ చేయాలని ఆమె కోరారు.

News January 13, 2026

నెల్లూరు జిల్లాలో MROలు పట్టించుకోవడం లేదు..!

image

అనంతసాగరం లింగంగుట్టలో 2022లో రీసర్వే చేసి 1B భూములను చుక్కల భూములుగా తేల్చారు. 114మందికి చెందిన భూములను ఒకే వ్యక్తి కిందకు చేర్చారు. బాధితులకు 1బీ అడంగల్ అందక, రిజిస్ట్రేషన్లు జరగక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నెల్లూరులో సోమవారం JCకి అర్జీ ఇవ్వగా.. వీటిని MRO, RDO లాగిన్‌లోనే చేయాలని చెప్పారు. MRO, RDOలకు ఈ అంశంలో ఫుల్ పవర్స్ ఇచ్చినా బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.