News November 3, 2024
KKR నన్నెందుకు రిటైన్ చేసుకోలేదో?: అయ్యర్ ఎమోషనల్

KKR రిటెన్షన్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయని టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తెలిపారు. తనను ఎందుకు రిటైన్ చేసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. ఆ జట్టుకు ఆడినన్ని రోజులు విజయం కోసం తీవ్రంగా శ్రమించానని ఆయన వ్యాఖ్యానించారు. వేలంలో మళ్లీ తనను ఆ జట్టు కొనుగోలు చేయొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. కాగా అయ్యర్ KKR తరఫున గత సీజన్‌లో 370 రన్స్ చేశారు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Similar News
News February 11, 2026
వైసీపీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది: పవన్

AP: వైసీపీ కుట్రలపై మూడు పార్టీలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభాపక్షం భేటీ అయింది. వైసీపీ విధ్వంస కుట్రలపై సభలో చర్చించాలని పవన్ పేర్కొన్నారు. ఆ పార్టీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
News February 11, 2026
AIతో సెకన్లలో బ్రెయిన్ MRI రిపోర్ట్.. 97.5% కచ్చితత్వంతో!

మెదడు వ్యాధులను గుర్తించడంలో AI సంచలనం సృష్టిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తలు Prima అనే AI మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇది బ్రెయిన్ MRI స్కాన్‌లను సెకన్లలోనే విశ్లేషించి 97.5% కచ్చితత్వంతో ఫలితాలిస్తుంది. సుమారు 2.2లక్షల స్కాన్‌లతో ట్రైన్ అయిన ఈ మోడల్.. బ్రెయిన్ ట్యూమర్స్, స్ట్రోక్స్ వంటి 50కి పైగా సమస్యలను గుర్తించగలదు. వైద్య నిపుణులు లేని ప్రాంతాల్లో ఇది ప్రయోజనకరంగా మారనుంది.
News February 11, 2026
శాస్త్ర రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం అందించడం కోసం ఓ రోజు ఉండాలని యునెస్కో నిర్ణయించింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్&టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.


