News November 3, 2024

రోహిత్ శర్మ చెత్త రికార్డు

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యల్ప పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా ఆయన నిలిచారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో హిట్ మ్యాన్ 6 ఇన్నింగ్స్‌లో కలిపి 91 పరుగులే చేశారు. ఈ జాబితాలో రామ్‌చంద్ (68-1959/60), అజిత్ వాడేకర్ (82-1974), పటౌడీ (85-1974/75) తొలి 3 స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ (97-1989/90) ఉన్నారు.

Similar News

News November 8, 2025

ఈ స్నాక్స్ ట్రై చేయండి

image

పిల్లలు స్కూల్లో, పెద్దలు ఆఫీసుల్లో తినడానికి బెస్ట్ స్నాక్స్
*వేయించిన శనగలు
*బాదాం లేదా వాల్‌నట్స్
*ఆపిల్ లేదా జామ
*డార్క్ చాక్లెట్లు
*హోం మేడ్ ప్రొటీన్ లడ్డూ
*గుమ్మడి, అవిసె, చియా సీడ్స్
*ఉడకబెట్టిన గుడ్డు

News November 8, 2025

భారత్‌ని టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

image

పాక్‌తో సంబంధమున్న ‘ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్‌ని టార్గెట్‌ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ‘డెస్క్ ర్యాట్’ అనే అడ్వాన్స్డ్ స్పై వేర్‌తో ప్రభుత్వం, ఆర్మీ కంప్యూటర్స్‌ని అటాక్ చేస్తున్నట్లు తెలిపాయి. భారత కంప్యూటర్ల ద్వారా చైనా మిలిటరీ కదలికలు చూసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపాయి. నకిలీ ఈమెయిల్స్‌తో స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసుకునేలా ట్రాప్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.

News November 8, 2025

లోన్లు తీసుకున్నవారికి HDFC శుభవార్త

image

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు HDFC బ్యాంకు ప్రకటించింది. ఇదివరకు MCLR 8.45-8.65% మధ్య ఉండగా, ఇప్పుడు 8.35%-8.60%కి తగ్గింది. దీంతో ఒకరోజు, నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది, మూడేళ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాయి. నవంబర్ 7 నుంచి కొత్త MCLR రేట్లు అమల్లోకి వచ్చినట్లు ఆ బ్యాంకు పేర్కొంది.