News November 3, 2024
అలాంటి భవనం కట్టనందుకు సిగ్గు పడండి: అంబటి

AP: తమ భవనాలను కూల్చినట్లే రిషికొండను కూడా కూలుస్తావా చంద్రబాబు అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మాట్లాడారు. ‘రిషికొండ భవనాలు అద్భుతమని చంద్రబాబే చెబుతున్నారు. అమరావతిలో అలాంటి భవనం ఒక్కటి కూడా కట్టలేనందుకు ఆయన సిగ్గుపడాలి. జగన్ సంక్షేమ పథకాలతోపాటు అద్భుత భవనాలు కట్టారు. లోకేశ్ రెడ్ బుక్కు కుక్కలు కూడా భయపడవు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News December 25, 2025
ప్రెగ్నెన్సీలో కింద కూర్చొంటున్నారా?

గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ఆ మార్పులను గమనించుకుని తగిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రెగ్నెన్సీలో కింద కూర్చోవాలి అనుకుంటే గర్భాశయం మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బాసింపట్టు వేసుకుని కూర్చునే అలవాటు లేని వాళ్ళు ప్రెగ్నెన్సీ టైమ్ లోప్రయత్నించవద్దు. ఎవరైతే నడుము నొప్పితో బాధపడే ప్రెగ్నెన్సీ మహిళలు ఉంటారో వాళ్ళు బాసింపట్లు వేసుకుని కూర్చోకూడదని నిపుణులు చెబుతున్నారు.
News December 25, 2025
శివుడిగా పూజలందుకున్న తిరుమల శ్రీవారు

తిరుమల శ్రీవారు ఒకప్పుడు శివుడిగా పూజలందుకున్నారని చాలామందికి తెలిసుండదు. మూలవిరాట్టుకు ఉన్న జటలు, నాగభూషణాలు చూసి భక్తులు ఆయనను ఈశ్వరుడిగా భావించేవారు. రామానుజాచార్యులు నిర్వహించిన పరీక్షలో శ్రీవారు శంఖుచక్రాలు ధరించి అది వైష్ణవ రూపమని నిరూపించారు. తిరుమల ఆలయానికి రుద్రుడు క్షేత్రపాలుడిగా ఉండటం హరిహర అద్వైతానికి, శైవ వైష్ణవ సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News December 25, 2025
నేటితో ముగియనున్న సుపరిపాలన యాత్ర

AP: మాజీ PM వాజ్ పేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర నేటితో ముగియనుంది. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన యాత్రను రాజధాని అమరావతిలో ముగించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని అటల్ స్మృతివనంలో 11amకు అటల్ కాంస్య విగ్రహాన్ని CM CBN ఆవిష్కరిస్తారు. BJP ముఖ్యనేతలు హాజరుకానున్నారు. స్మృతివనానికి N4, E4 రోడ్డు జంక్షన్లో 2.33ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.


