News November 3, 2024
పెర్త్ టెస్టు ఆడతానో లేదో: రోహిత్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు తాను అందుబాటులో ఉంటానో లేదో ఇప్పుడే చెప్పలేనని రోహిత్ శర్మ అన్నారు. న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ అనంతరం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తన కెరీర్లో ఇదే లోయెస్ట్ పాయింట్ అని పేర్కొన్నారు. కాగా AUSతో తొలి టెస్ట్ ఈనెల 22నుంచి పెర్త్‌లో జరగనుంది. ఇదే సమయంలో రోహిత్ వైఫ్ రితిక రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని, అందుకే ఆయన తొలి టెస్టులో ఆడకపోవచ్చని సమాచారం.
Similar News
News December 30, 2025
గ్రూప్1: JAN 22న తీర్పు

తెలంగాణ గ్రూప్1 సెలక్షన్ లిస్టుపై హైకోర్టు JAN 22న తీర్పు ఇవ్వనుంది. లిస్టుపై కొందరు అభ్యర్థులు HCకి వెళ్లగా జాబితాను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. దీనిపై TGPSC అప్పీల్‌కు వెళ్లడంతో, రద్దు తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తాజాగా CJ బెంచ్ ఇరు పక్షాల వాదనలు నమోదు చేసింది. తప్పుల తడకగా ఎగ్జామ్ జరిగిందని సెలక్ట్ కాని అభ్యర్థులు ఆరోపించగా, అంతా రూల్స్ ప్రకారమే జరిగిందని కమిషన్ వివరణ ఇచ్చింది.
News December 30, 2025
ఇతిహాసాలు క్విజ్ – 112 సమాధానం

ఈరోజు ప్రశ్న: జరాసంధుడికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: జరాసంధుడు బృహద్రథుడి కుమారుడు. బృహద్రథుడికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ సగం శిశువుకు జన్మనిచ్చారు. వింతగా ఉన్న ఆ శరీర భాగాలను బయట పారేయగా, ‘జర’ అనే రాక్షసి వాటిని దగ్గరకు చేర్చి కలిపింది. ఆ రెండు సగ భాగాలు అతుక్కుని పరిపూర్ణ బాలుడిగా మార్చింది. ‘జర’ అనే రాక్షసి ఆ శరీర భాగాలను సంధించడం వల్ల అతనికి ‘జరాసంధుడు’ అనే పేరు వచ్చింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 30, 2025
సల్మాన్ మూవీపై చైనా అక్కసు.. భారత్ కౌంటర్!

గల్వాన్ ఘటన నేపథ్యంలో వస్తున్న సల్మాన్ ఖాన్ మూవీ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ భారత్ వైపు ఏకపక్షంగా ఉందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఆరోపించింది. ఈ కథనంపై చైనాకు భారత్ కౌంటర్ ఇచ్చింది. ‘ఫిల్మ్ మేకర్స్‌కు ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్లు ఏది ముఖ్యమని భావిస్తారో దానినే ఎంచుకుంటారు. సినిమాటిక్ ఎక్స్‌ప్రెషన్‌కు రాజకీయ రంగు పులమకూడదు’ అని భారత్ రియాక్ట్ అయినట్లు ‘ఇండియా టుడే’ పేర్కొంది.


