News November 3, 2024

సిడ్నీ చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

image

ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆతిథ్యమిస్తున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ)లో పాల్గొనడానికి ఆయన సిడ్నీకి వెళ్లారు. ఆయనతో పాటు శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉన్నారు. అయ్యన్నపాత్రుడును సిడ్నీ విమానాశ్రయంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Similar News

News November 5, 2025

విశాఖ: శ్మశానం వద్ద ఉరి వేసుకుని యువకుడి మృతి

image

మధురవాడలోని చంద్రంపాలెం గ్రామంలో శ్మశానం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉరి వేసుకొని ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గేదెల ఫణి (18)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 5, 2025

విశాఖ: అంగన్వాడీ ఉద్యోగాలు.. 2 పోస్టులకు 22మంది

image

ఐసీడీఎస్ విశాఖ అర్బన్ పరిధిలో అంగన్వాడి వర్కర్, హెల్పర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 22 మంది, 21 హెల్పర్ పోస్టులకు 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చేయాల్సిన దరఖాస్తు పరిశీలన 12 గంటలకు చేపట్టారు. చివరిరోజు కావడంతో ఎక్కువమంది ఒకేసారి చేరుకున్నారు. దీంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

News November 5, 2025

గాజువాక: ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు కాజేశారు

image

గాజువాకలో భార్యాభర్తలిద్దరినీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టివాణిపాలేనికి చెందిన అలేఖ్య నర్సింగ్ చదువుతుండగా.. భర్త వినాయకరావు బీటెక్ చదివాడు. ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మల్కాపురానికి చెందిన మచ్చ సజిని, నారాయణ రూ.91 లక్షలు కొట్టేశారు. వీరికి శ్రీహరిపురానికి చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్య కుమార్, సీరపు రాంప్రసాద్, సీరపు అనిత సహకరించారు.