News November 3, 2024
నాన్న హంతకురాలిని ప్రియాంక ఆలింగనం చేసుకున్నారు: రాహుల్

రాజీవ్ గాంధీ హంతకురాలు నళినిని ఆలింగనం చేసుకోవడమే కాకుండా ఆమె పరిస్థితిని చూసి జాలిపడిన కరుణ గల వ్యక్తి ప్రియాంకా గాంధీ అని రాహుల్ గాంధీ అన్నారు. జీవితంలో ఆమె ఈ రకమైన పెంపకాన్ని పొందారని, ప్రస్తుతం దేశంలో ఈ తరహా ప్రేమ-ఆప్యాయతలతో కూడిన రాజకీయాల అవసరం ఉందని, ద్వేషపూరిత రాజకీయాలు కాదన్నారు. వయనాడ్‌లో ప్రియాంక గెలిస్తే ఉత్తమ MPగా నిలుస్తారని రాహుల్ పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
జూబ్లీ‘హిట్’ అయ్యేదెవరో?

హాట్ సీటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది దశకు చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దివంగత MLA మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇచ్చిన BRS సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న INC నవీన్ యాదవ్ గెలుపునకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు జూబ్లీహిల్స్‌లో కాషాయ జెండా ఎగురవేస్తామని BJP చెబుతోంది. మీ కామెంట్?
News November 9, 2025
15L టన్నుల చక్కెర ఎగుమతికి గ్రీన్‌సిగ్నల్?

2025-26లో 15L టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొలాసిస్(చక్కెర తయారీలో ఏర్పడే ద్రవం)పై 50% ఎగుమతి సుంకాన్ని ఎత్తేస్తుందని సమాచారం. దీనివల్ల మిల్లులకు లాభాలు, రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతాయని భావిస్తోంది. వచ్చే సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 18.5% పెరిగి 30.95M టన్నులకు చేరుతుందని అంచనా. ఇథనాల్ ఉత్పత్తికి 34L టన్నులు వినియోగించినా భారీగా మిగులు ఉండనుంది.
News November 9, 2025
శ్రీవారి తొలి సోపాన మార్గం ‘అలిపిరి’

తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి కాలి నడకన వెళ్లేందుకు మొదటి మెట్టు అయిన మార్గమే ‘అలిపిరి’ సోపాన మార్గం. ఇది అలిపిరి వద్ద మొదలవుతుంది. పూర్వం కపిలతీర్థం నుంచి కొండదారి ఉండేది. భక్తుల సౌకర్యార్థం మట్లకుమార అనంతరాజు ఈ మార్గాన్ని పునరుద్ధరించి, నిర్మించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ ‘అనంతరాజు’ మార్గం అలిపిరి నుంచే మొదలై, భక్తులకు స్వామి సన్నిధికి చేరేందుకు సరళ దారిని చూపింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>


