News November 3, 2024

IPL.. RCB కెప్టెన్ కోహ్లీ కాదా?

image

RCB కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆ జట్టు డైరెక్టర్ మొ బొబట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్రాంచైజీ ఇంకా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోలేదు. మాకు ఇంకా ఆప్షన్లు ఉన్నాయి. మా పాత కెప్టెన్ డుప్లిసెస్‌ను మేం రిటైన్ చేసుకోలేదు. అతడు గతేడాది అద్భుతంగా జట్టును ముందుకు నడిపారు. వేలంలో ఓపెన్ మైండ్‌తో ఆలోచిస్తాం’ అని అన్నారు. దీంతో RCB కెప్టెన్ ఎవరనే దానిపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.

Similar News

News November 5, 2025

కోతుల మధ్య కూర్చుంటే యోగిని ఎవరూ గుర్తించరు: అఖిలేశ్

image

బిహార్ ప్రచారంలో UP CM యోగి ఆదిత్యనాథ్‌ ‘మూడు కోతుల’ వ్యాఖ్యలకు SP చీఫ్ అఖిలేశ్ కౌంటరిచ్చారు. ‘ముఖ్యమైన సమస్యల నుంచి ప్రజలను దారిమళ్లించడానికి BJP 3 కోతుల సిద్ధాంతాన్ని గుర్తుచేసుకుంటోంది. నిజానికి ఆదిత్యనాథ్ కోతుల గుంపులో కూర్చుంటే ఆయనను ఎవరూ గుర్తుపట్టలేరు’ అని ఎద్దేవా చేశారు. రాహుల్, తేజస్వి, అఖిలేశ్‌లను యోగి 3 కోతులతో పోల్చి <<18187731>>విమర్శించిన<<>> విషయం తెలిసిందే.

News November 5, 2025

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌( NHSRC) 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, MBA, MBBS, BDS, నర్సింగ్, BHMS, BAMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: nhsrcindia.org/

News November 5, 2025

2,500 విద్యాసంస్థలు మూతబడ్డాయి.. బండి సంజయ్ ఫైర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నీరుగార్చుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘రాష్ట్ర చరిత్రలో తొలిసారి 2,500 విద్యాసంస్థలు మూతబడ్డాయి. BRS పాలనలో రెండేళ్లు, కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాక స్టూడెంట్స్, స్టాఫ్ ఇబ్బందులు పడుతున్నారు. రూ.10,500 కోట్ల బకాయిల్లో సగం చెల్లించమని యాజమాన్యాలు కోరినా ప్రభుత్వం కమిటీలంటూ కాలయాపన చేస్తోంది’ అని ట్వీట్ చేశారు.