News November 3, 2024
ఈనెల 8న యాదాద్రికి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 8న యాదాద్రి గుట్టకు వెళ్లనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎం అయ్యాక ఆయన జరుపుకుంటున్న మొదటి జన్మదినం ఇదే. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నేతలు, అధికారులు ఇవాళ పరిశీలించారు.
Similar News
News September 19, 2025
వారాహి పీఠం కాదు.. వారాహి దేవస్థానం

కాకినాడ రూరల్ కొవ్వూరులో వివాదస్పదమైన వారాహి పీఠంను ఇటీవల దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వారాహి పీఠం బోర్డు తొలగించి వారాహి దేవస్థానంగా అధికారులు నామకరణం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలను దేవస్థానాలుగా పిలుస్తారని.. అందుకే పీఠం పేరు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
News September 19, 2025
కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లేనా: రేవంత్

ఒక ప్రజా ప్రతినిధి మరొక పార్టీ జెండా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాసేపటి క్రితం నేను కూడా కొందరికి కండువాలు కప్పాను. ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారు’ అని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో ఉదహరించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు లేవని తెలిపారు. BRS ఫిర్యాదుపై స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు.
News September 19, 2025
ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం: CM రేవంత్

TG: SEP 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో CM రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈనెల 30లోపు నిర్వహించాలంటూ HC ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను HCకి వివరించి, ఏం చేయాలో కోరుతామన్నారు. CM వ్యాఖ్యలను బట్టి ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని స్పష్టమవుతోంది.