News November 4, 2024

మరింత అందంగా మన హైదరాబాద్

image

మన హైదరాబాద్‌ను జీహెచ్ఎంసీ మరింత అందంగా ముస్తాబుచేస్తోంది. బల్దియా పరిధిలోని అన్ని జంక్షన్లను సుందరీకరిస్తున్నారు. ఎల్బీనగర్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డినగర్‌తో పాటు ఇతర ఏరియాల్లోని ఫ్లై ఓవర్లు, జంక్షన్ల వద్ద రంగు రంగుల బొమ్మలు గీస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఈ చిత్రాలు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి.

Similar News

News November 10, 2025

కోకాపేట్, మూసాపేట్‌లో భూముల వేలం!

image

కోకాపేట్, మూసాపేట్ ప్రాంతాల్లోని 9 ఖాళీ ప్లాట్ల ఈ-వేలం కోసం HMDA సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి నవంబర్ 17 ఉదయం 11:00 గంటలకు T-Hub వేదికగా ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనుంది. కోకాపేట్ నియోపోలిస్ (6), గోల్డెన్ మైల్ (1), మూసాపేట్‌లో (2) ప్లాట్లు వేలం వేయనున్నారు. ఆసక్తిగల డెవలపర్లు పాల్గొనవచ్చని HMDA పిలుపునిచ్చింది. మరింత సమాచారం కోసం www.hmda.gov.inను సంప్రదించండి.
SHARE IT

News November 10, 2025

జూబ్లీ బైపోల్: ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు!

image

ప్రజాస్వామ్యం పటిష్ఠం కావాలంటే ప్రతి ఓటు కీలకం. ఓటు హక్కు మాత్రమే కాదు, భవిష్యత్తుకి బలం. పార్టీ, వ్యక్తి, వాగ్ధానాల కన్నా రాష్ట్రం కోసం ఆలోచించాలి. ఓటుతో మార్పు తీసుకురావాలి. ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అభివృద్ధి, మంచి పాలన కోసం ఓటు వేయడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత. సెలవు దినం కాదు, సమాజానికి సమర్పణ రోజు అని గుర్తుంచుకోవాలి.
☛రేపే జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్

News November 10, 2025

జూబ్లీ బైపోల్: BRS నాయకత్వానికి KCR కీలక ఆదేశాలు

image

జూబ్లీ బైపోల్‌కు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా BRS అధ్యక్షుడు KCR ఈ రోజు సాయంత్రం KTR, హరీశ్ రావు, కొంతమంది ముఖ్యమైన BRS నాయకులతో సమావేశం కానున్నారు. రేపు పోల్ మేనేజ్మెంట్ కీలకమని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ఓట్ల కోసం అధికారం, డబ్బును ఉపయోగించుకుంటుందని హెచ్చరించారు. పోలింగ్ స్థితిని పర్యవేక్షించడానికి కొన్ని ముఖ్యమైన పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక BRS బృందాలను మోహరించనున్నట్లు సమాచారం.