News November 4, 2024
భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల క్షేత్రం

కార్తీక మాసం, మొదటి సోమవారం పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా వచ్చారు. భక్తులు ఉచిత, ఆర్జిత సేవ టికెట్లతో క్యూ లైనల్లో గంటల తరబడి వేచి ఉండి శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.
Similar News
News January 18, 2026
కర్నూలు: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కోడుమూరు, గోనెగండ్ల, పెద్దకడబూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్ రూ.300, స్కిన్‌లెస్ రూ.310-320 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
News January 17, 2026
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణాత్మక వ్యవసాయ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఈ-క్రాప్ బుకింగ్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, వరికి బదులుగా మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, అరటి వంటి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంట సేకరణ, మార్కెటింగ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
News January 17, 2026
కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.


