News November 4, 2024

హైదరాబాద్‌లో బద్వేల్ వాసి మృతి

image

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై జరిగిన యాక్సిడెంట్‌లో బద్వేల్‌కు చెందిన బ్రహ్మయ్య(45) మృతిచెందాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. బైకుపై రాంగ్ రూట్లో వచ్చిన బ్రహ్మయ్యను నియంత్రణ తప్పిన కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రికి తరలించాగా.. చికిత్స పొందుతూ బ్రహ్మయ్య మృతిచెందాడు. వనస్థలిపురం వాసి విజయ్ కుమార్ కారులో ఐమాక్స్ నుంచి వెళ్తుండగా.. టర్నింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. కేసు నమోదైంది.

Similar News

News March 22, 2026

కడపలో టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ పూజలు

image

టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి శనివారం కుటుంబ సమేతంగా కడపలోని శ్రీ విజయ దుర్గాదేవిని దర్శించుకున్నారు. పదేళ్లుగా ఆమె తల్లి ఈ ఆలయంలో రాహుకేతు పూజలు చేస్తుండగా, శనివారం శ్రీచరణి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు. 2025 మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆమె కీలక సభ్యురాలు.

News March 21, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,800
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,616
*వెండి 10 గ్రాముల ధర రూ.2310