News November 4, 2024
TG టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టెట్ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన అర్హులు. స్కూలు అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందేందుకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో టీచర్లు పనిచేస్తున్న వారు సైతం దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Similar News
News November 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,12,950 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,67,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 10, 2025
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

TG: కవి అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. అందెశ్రీ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉంది. ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 10, 2025
ప్రస్థానత్రయం అంటే ఏమిటి?

హిందూ తత్వశాస్త్రంలో అత్యంత ప్రామాణిక గ్రంథాలైన ఉపనిషత్తులు(శ్రుతి ప్రస్థానం), బ్రహ్మ సూత్రాలు(న్యాయ ప్రస్థానం), భగవద్గీత (స్మృతి ప్రస్థానం).. ఈ మూడింటిని కలిపి ‘ప్రస్థానత్రయం’ అంటారు. ఇవి జ్ఞాన మార్గానికి దారులుగా పరిగణిస్తారు. ముఖ్య సిద్ధాంతాలకు ఇదే ఆధారం. ప్రతి ఆచార్యుడు తమ సిద్ధాంతాలను స్థాపించడానికి వీటిపై భాష్యం రాయడం తప్పనిసరి. ఇవి బ్రహ్మ జ్ఞానాన్ని బోధించే అత్యున్నత గ్రంథాలు. <<-se>>#VedikVibes<<>>


