News November 4, 2024
నేనెవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు: హర్షసాయి

డబ్బు తీసుకుని మోసం చేశారంటూ తనపై ఓ యువతి చేసిన ఆరోపణలను యూట్యూబర్ హర్షసాయి ఖండించారు. ఈ కేసులో TG హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొన్ని వారాలుగా విదేశాల్లో ఉన్న అతను ఇవాళ HYD తిరిగొచ్చారు. ‘నేనెవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు. డిమాండ్ చేయలేదు. నేను తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్ అడిగారు. రూ.2 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. నిజాలు బయటికొచ్చాయి కాబట్టే బెయిల్ వచ్చింది’ అని చెప్పారు.
Similar News
News December 26, 2025
తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

AP: వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టికెట్లు లేనివారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలా తోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. కొండపై రూమ్స్ దొరకడం కష్టంగా మారింది. నిన్న 72వేల మంది భక్తులు వేంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.4.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. కాగా డిసెంబర్ 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
News December 26, 2025
సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఇవి చూడటం ముఖ్యం

చర్మాన్ని UV రేస్ నుంచి కాపాడటానికి సన్‌స్క్రీన్ వాడతాం. కానీ వీటిలో కొన్ని పదార్థాలు కలిస్తే హానికరంగా మారతాయంటున్నారు నిపుణులు. సన్‌స్క్రీన్లలో ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్, క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ లేకుండా చూసుకోవాలి. లేబుల్స్‌పై ఫ్రాగ్రెన్స్ అని ఉంటే థాలేట్స్, పారాబెన్స్ ఉంటే కొనకపోవడమే మంచిదని, ఇవి హార్మోన్లను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.
News December 26, 2025
సంక్రాంతికి రైతుభరోసా..!

TG: యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులను (ఏడాదికి ఎకరానికి రూ.12,000) సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు, పంట డేటా సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


