News November 4, 2024
బ్యాట్‌తో మెరిసి ఆస్ట్రేలియాను గెలిపించిన కమిన్స్

పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో ఓటమి తప్పదనుకున్న దశలో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బ్యాట్‌తో మెరిశారు. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 155కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ కమిన్స్ బౌలర్లతో కలిసి లక్ష్యాన్ని ఛేదించారు. 31 బంతుల్లో 32 పరుగులతో రాణించారు. అంతకుముందు షాహీన్ అఫ్రిదీ (24), నసీమ్ షా (40) చివర్లో రాణించడంతో పాక్ 203 రన్స్ చేసింది.
Similar News
News July 4, 2025
మథుర ‘షాహీ దర్గా’ పిటిషన్ కొట్టివేత!

శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం మరో మలుపు తిరిగింది. మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయంలోని షాహీ దర్గాని వివాదాస్పద కట్టడంగా ప్రకటించాలని హిందూ సంఘాలు దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ముస్లిం సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది. కృష్ణ జన్మభూమిపై హిందూ సంఘాలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.
News July 4, 2025
కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు: దాసోజు శ్రవణ్

TG: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ Way2Newsకు తెలిపారు. KCRకు తీవ్ర అనారోగ్యం ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సాధారణ నీరసానికే చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుపై పోరాటానికి సిద్ధమవుతున్నారని దాసోజు పేర్కొన్నారు. కాగా సోడియం లెవెల్స్ పడిపోవడంతో కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నారు.
News July 4, 2025
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు: వాతావరణ కేంద్రం

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.