News November 4, 2024

BCCI తదుపరి సెక్రటరీగా రోహన్ జైట్లీ?

image

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కార్యదర్శిగా రోహన్ జైట్లీని నియమించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈనెలలో జైషా ఈ పదవికి రాజీనామా చేసి DEC 1న ICC తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. రోహన్ జైట్లీ 2020 నుంచి ఢిల్లీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ సైతం BCCI సెక్రటరీ పదవి కోసం పోటీ పడుతున్నారు. దీనిపై త్వరలో ప్రకటన రానుంది.

Similar News

News November 4, 2025

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి జరిగితే మేమొస్తాం: బీజేపీ

image

తన కొడుకు పెళ్లి అన్నట్లుగా బిహార్‌లో ప్రధాని మోదీ తిరుగుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇది రాజకీయ దిగజారుడుతనమని మండిపడింది. రాహుల్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి సెటైర్లు వేసింది. ‘ఖర్గేజీ మీ కాంగ్రెస్ యువరాజు (రాహుల్) పెళ్లి ఎప్పుడైనా జరిగితే మేం కచ్చితంగా హాజరవుతాం’ అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.

News November 4, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

* TG: 1,037 ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ G.O. జారీ. 2026 మార్చి 31 వరకు వారు విధుల్లో కొనసాగనున్నారు.
* తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను కోరిన సీఎం రేవంత్
* సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను సహించం: ఏపీ హోంమంత్రి అనిత
* మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని TG సర్కార్ ఆదేశం

News November 4, 2025

APPLY NOW: NRDCలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<>NRDC<<>>)3 అసిస్టెంట్ మేనేజర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ/ఎంటెక్, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://www.nrdcindia.com