News November 4, 2024

ఎల్.ఎన్.పేట: మిల్లుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం పెద్దకొల్లివలస సమీపంలోని దమయంతి మోడ్రన్ రైస్ మిల్‌పై నుంచి జారిపడి సాహుకారి వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిల్లుకు సోలార్ ప్లేట్లు వేసేందుకు కొలతలు వేస్తుండగా సిమెంట్ రేకులు పగిలి వెంకటరమణ కిందకు జారిపడి మృతి చెందినట్లు చెప్పారు. మరో వ్యక్తి నాయుడుకు స్వల్ప గాయాలయ్యాయి. సరుబుజ్జిలి ఇన్‌ఛార్జ్ ఎస్ఐ రాజేష్ వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News January 19, 2026

మెళియాపుట్టి: ‘వినోదం కోసం వెళ్తే విషాదం ఆవరించింది’

image

వినోదం కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఆడలి వ్యూ పాయింట్‌కు వెళ్లిన కుటుంబంలో విషాదం నింపింది. నిన్న సాయంత్రం ఏజెన్సీలో ప్రకృతి అందాలను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా..వారి వాహనం ఆడలి వ్యూ పాయింట్ వద్ద రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు మెళియాపుట్టి మండలానికి చెందిన వారిగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 19, 2026

SKLM: నేటి నుంచి సురభి నాటక వైభవం

image

కళల కాణాచి శ్రీకాకుళం నగరంలో పౌరాణిక నాటక సందడి మొదలవనుంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రసిద్ధ సురభి నాటక సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరగనున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ నాటకోత్సవాలు జరుగుతాయి. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియం వేదికగా సోమవారం (జనవరి 19) నుంచి ఐదు రోజుల పాటు ప్రదర్శనలు కొనసాగనున్నాయి.

News January 19, 2026

SKLM: నేడే హెలికాప్టర్ రైడ్..టికెట్ ధర ఎంతంటే?

image

రథసప్తమి వేడుకల సందర్భంగా సోమవారం (జనవరి 19) నుంచి హెలికాప్టర్ రైడింగ్ జరుగనుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ఆఫ్‌లైన్‌లోనే 3 కౌంటర్ల ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు. హెలికాప్టర్ రైడింగ్ చేసేవారు రూ.2,200 టికెటు తీసుకోవాలన్నారు. ఉదయం 10 గంటల నుంచే మొదలై, రోజుకు 200-250 మంది వరకు రైడ్‌లో వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.