News November 4, 2024
పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలి: మంత్రి
TG: గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పనిలో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News November 5, 2024
లక్నోలో ‘గేమ్ ఛేంజర్’ టీజర్ లాంచ్ ఈవెంట్
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ టీజర్‌ను మేకర్స్ మరో 4 రోజుల్లో రిలీజ్ చేయనున్నారు. ఈనెల 9న లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.
News November 5, 2024
రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే
TG: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేస్తారని సమాచారం. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వేసేలా ఏర్పాట్లు చేసింది.
News November 5, 2024
HBD KOHLI: సచిన్, గంగూలీ కలిస్తే..
మైదానంలో పరుగుల వరదను పారించిన గ్రేటెస్ట్ క్రికెటర్ సచిన్. భారత క్రికెట్‌కు దూకుడైన కెప్టెన్సీ నేర్పించిన నాయకుడు గంగూలీ. ఒకరిది కామ్ అండ్ కంపోజ్డ్ ఆటతీరు. మరొకరిదేమో అగ్రెషన్, ప్రత్యర్థికి వెరవని ధీరత్వం. వీరిద్దరినీ పుణికిపుచ్చుకున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. బ్యాటుతో సునామీ సృష్టించిన అతడు కెప్టెన్‌గా అంతకుమించే రాణించారు. SENA కంట్రీస్‌లో ప్రత్యర్థి మాటలకు నోటితో, బౌన్సర్లకు బ్యాటుతో జవాబిచ్చారు.