News November 4, 2024
DANGER: డైలీ ఎంత ఉప్పు తింటున్నారు?
ఉప్పుతో ఆహారానికి రుచి. అందుకే చాలామంది తినాల్సిన దానికంటే అధికంగా ఉప్పు తింటున్నారు. అయితే ఉప్పు ఎక్కువ లేక తక్కువ తిన్నా ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏటా దాదాపు 20లక్షల మరణాలకు ఉప్పు కారణమవుతోందంటున్నారు. ఒక వ్యక్తి రోజుకు 5గ్రా.లు లేదా టీస్పూన్ ఉప్పు వాడాలని WHO చెబుతోంది. కానీ చాలామంది 11గ్రాములు తీసుకుంటున్నారు. అందుకే కొన్ని దేశాలు ఉప్పు వాడకం తగ్గించడంపై ఫోకస్ పెట్టాయి.
Similar News
News November 5, 2024
రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే
TG: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేస్తారని సమాచారం. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వేసేలా ఏర్పాట్లు చేసింది.
News November 5, 2024
HBD KOHLI: సచిన్, గంగూలీ కలిస్తే..
మైదానంలో పరుగుల వరదను పారించిన గ్రేటెస్ట్ క్రికెటర్ సచిన్. భారత క్రికెట్‌కు దూకుడైన కెప్టెన్సీ నేర్పించిన నాయకుడు గంగూలీ. ఒకరిది కామ్ అండ్ కంపోజ్డ్ ఆటతీరు. మరొకరిదేమో అగ్రెషన్, ప్రత్యర్థికి వెరవని ధీరత్వం. వీరిద్దరినీ పుణికిపుచ్చుకున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. బ్యాటుతో సునామీ సృష్టించిన అతడు కెప్టెన్‌గా అంతకుమించే రాణించారు. SENA కంట్రీస్‌లో ప్రత్యర్థి మాటలకు నోటితో, బౌన్సర్లకు బ్యాటుతో జవాబిచ్చారు.
News November 5, 2024
OTTలోకి ‘దేవర’ సినిమా.. ఎప్పుడంటే?
Jr.NTR హీరోగా నటించిన ‘దేవర’ పార్ట్-1 ఈనెల 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ తదితరులు నటించారు. సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రూ.500కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.