News November 5, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.2,49,322 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,39,134, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.76,550, అన్నదానం రూ.33,638,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

Similar News

News March 1, 2026

KNR: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

HYD బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 తరగతిలో ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు తెలిపారు. దీంతో పాటు పలు తరగతులలో ఖాళీగా ఉన్న 21 సీట్లను సైతం భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 28, 2026

KNR: ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఆలోచించాలి: ప్రొ.తిరుపతి

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని SRR ప్రభుత్వ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని వృక్ష శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పడాల మాట్లాడారు. మన దేశ శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, మూఢనమ్మకాలను విడిచి శాస్త్రీయ దృక్పథంతో మెలుగుదామన్నారు. “వికసిత భారత్” కల సాకారం కావాలంటే ప్రతి విద్యార్థి ఒక చిన్న శాస్త్రవేత్తగా ఆలోచించాలని, విద్యార్థులు పరిశోధనల వైపు మలగాలని పిలుపునిచ్చారు.

News February 27, 2026

BREAKING: కరీంనగర్‌లో కొలువుదీరిన కొత్త కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టగా.. నూతన కలెక్టర్‌కు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిత్రా మిశ్రా పేర్కొన్నారు.