News November 5, 2024
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: మంత్రి రాజనర్సింహా

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. రైస్ మిల్లర్స్ అండర్ టేకింగ్ త్వరితగతిన అందజేయాలని సూచించారు. కొనుగోలు సమస్యలతో రైతులు రోడ్లమీదకు రావద్దన్నారు. సోమవారం మెదక్‌లో ధాన్యం కొనుగోలు, మిల్లర్స్ అండర్ టేకింగ్, డిఫాల్ట్ మిల్లుల సమస్యలపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 13, 2026
‘మెదక్ జిల్లాను ఛార్మినార్ జోన్లో కలపాలి’

మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి తొలగించి, చార్మినార్ జోన్లో కలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఉద్యోగ సంఘాలు వినతిపత్రం అందజేశాయి. ప్రస్తుత జోన్ వల్ల పదోన్నతుల్లో ఉద్యోగులకు, ఉద్యోగ అవకాశాల్లో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై పునరాలోచన చేస్తున్న తరుణంలో, మెదక్‌ను చార్మినార్ జోన్లో చేర్చి న్యాయం చేయాలని కోరారు.
News January 13, 2026
మెదక్: జాగ్రత్తగా గాలిపటాలు ఎగరవేయాలి: ఎస్పీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రజలంతా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అంటే గాలిపటాల సంబరమని, అయితే ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.
News January 13, 2026
తూప్రాన్: ఎమ్మెల్సీకి శుభాకాంక్ష లేఖలు అందజేత

ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డికి విద్యుత్ శాఖ తరపున ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గృహజ్యోతి, వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగదారులకు అందజేస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు లేఖలను మెదక్ విద్యుత్ శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ అందజేశారు. ఎమ్మెల్సీకి గృహజ్యోతి పథకం, వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం గురించి వివరించారు. డీఈ టెక్నికల్ విజయ శ్రీనివాస్, తూప్రాన్ ఏఈ వెంకటేశ్వర్లు, ఏఈ కమర్షియల్ రాజు పాల్గొన్నారు.


