News November 5, 2024
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్య ఇదే..

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్లు మొత్తం 727మంది ఉన్నారు. వీరిలో పార్వతీపురం జిల్లాలో 325 మంది ఉండగా, ఇందులో పురుషులు 132, మహిళలు 193 మంది ఉన్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం 402 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 239 మంది మహిళా ఓటర్లు, 163 పురుష ఓటర్లు ఉన్నారు. రాజకీయ పార్టీలు ముసాయిదా జాబితాపై తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఈ నెల 8వ తేదీ లోగా తెలియజేయవచ్చు.
Similar News
News February 3, 2026
విజయనగరం ఎంపీని ప్రత్యేకంగా అభినందించిన స్పీకర్ ఓంబిర్లా

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో టీడీపీ ఎంపీలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని ప్రత్యేకంగా అభినందించి, ప్రతి రోజు సైకిల్‌పై పార్లమెంట్‌కి రావడం, పార్లమెంట్‌లో అరకు కాపీ ఏర్పాటుకు తీసుకున్న శ్రద్ధలపై ప్రశంసలు కురిపించారు.
News February 3, 2026
VZM: వివిధ శాఖల పనితీరుపై జేసీ అసంతృప్తి

PGRSకు వచ్చే వినతులను రెండు పూటలా లాగిన్‌లో తనిఖీ చేసి, గడువు లోపే పరిష్కరించాలని JC సేధు మాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ పిటిషన్‌లకు ఎమ్మార్వోలు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఐవీఆర్‌ఎస్‌లో కొన్ని శాఖలకు నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, అన్నా కాంటీన్లు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, హెల్త్, ఇరిగేషన్ వంటి శాఖలు పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు.
News February 3, 2026
VZM: ఆర్ముడు రిజర్వ్ పోలీసులకు 12 రోజుల శిక్షణ

సమాజంలో మార్పులకు అనుగుణంగా పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు ఆర్ముడు రిజర్వ్ పోలీసులకు 12 రోజుల పునశ్చరణ (మొబిలైజేషన్) శిక్షణను స్థానిక పరేడ్ గ్రౌండ్‌లో ఎస్పీ దామోదర్ సోమవారం ప్రారంభించారు. రిజర్వ్ పోలీసులు జిల్లా పోలీసుశాఖకు బలమైన శక్తిగా ఉన్నారన్నారు. యూనిఫాం ధరించిన తరువాత ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకే అంకితమవ్వాలని ఆయన సూచించారు. విధుల్లో నిష్పక్షపాతంగా, నిజాయితీతో పనిచేయాలన్నారు.


