News November 5, 2024

‘మ్యూజికల్ ఛైర్’లాంటిది ఉండదు: ఫడ్నవీస్

image

MH ఎన్నికల వేళ CM పదవిపై Dy cm దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి గెలిస్తే ‘మ్యూజికల్ ఛైర్’ లాంటిది ఉండదన్నారు. మిత్రపక్షాలన్నీ కలిసి CMను నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే సహా కూటమిలోని ఏ నాయకుడూ ఆ పదవిని డిమాండ్ చేయలేడని, నిర్ణయం న్యాయంగా ఉంటుందని అంతా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కాగా మహాయుతి మరోసారి అధికారంలోకి వస్తే ఫడ్నవీసే CM అవుతారని ప్రచారం జరుగుతోంది.

Similar News

News February 4, 2026

త్వరలో దూత-2 వెబ్‌సిరీస్?

image

కార్తీక్ దండు-నాగ చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో దూత-2 వెబ్‌సిరీస్‌పై చైతూ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని టాక్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023లో విడుదలైన దూత వెబ్ సిరీస్ హిట్టయిన విషయం తెలిసిందే.

News February 4, 2026

APPLY NOW: RRBలో 22,195 పోస్టులు

image

RRB 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.18వేలు చెల్లిస్తారు. CBT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News February 4, 2026

ఫేస్‌వాష్ ఎందుకు వాడాలంటే?

image

కాలుష్యం, సూర్యరశ్మి, మేకప్ ప్రభావం ముఖంపై పడుతుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలామంది ఫేస్‌వాష్ చెయ్యడానికి సబ్బునే వాడతారు. కానీ సబ్బులో ఉండే రసాయనాల వల్ల ముఖంపై ఉండే pH దెబ్బతింటుదంటున్నారు నిపుణులు. ఫేస్‌వాష్‌లు చర్మాన్ని మృదువుగా శుభ్రపరచడంతో పాటు లోతుగా క్లీన్ చేస్తాయి. ఫేస్‌వాష్ ద్వారా pH బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ అవుతుందంటున్నారు నిపుణులు.