News November 5, 2024
బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు దరఖాస్తులు

AP: బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్లు, రెండేళ్ల కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్‌కు ఎన్టీఆర్ వర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి 7వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. కన్వీనర్ కోటాలో 8,804 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 6,664 భర్తీ అయ్యాయి. మిగిలిన అన్ని సీట్లను రెండో విడతలోనే భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్: https://apuhs-ugadmissions.aptonline.in/MBBS
Similar News
News November 2, 2025
క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి?

క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమికి ముందు వస్తుంది. ఈరోజున విష్ణువు బృందావనంలోకి (తులసి కోటలోకి) అడుగుపెడతారు. అందుకే వ్రతం ఆచరించే వారు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మను ఉంచి పూజిస్తారు. తులసి కోటకు సమీపంలో విష్ణువు (లేదా) కృష్ణుడి ప్రతిమను ఉంచి పూజించడం శ్రేష్ఠం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తే, ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి.
News November 2, 2025
ఇంటర్వ్యూతో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు

ఫరీదాబాద్‌లోని బ్రిక్ ట్రాన్స్‌లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్(<
News November 2, 2025
IAS అకాడమీల తప్పుడు ప్రచారాలు.. భారీ జరిమానా

UPSCలో అభ్యర్థుల విజయాలను తమ ఘనతగా చెప్పుకున్న ఢిల్లీలోని రెండు IAS కోచింగ్ సెంటర్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కొరఢా ఝళిపించింది. ఒక్కో సంస్థకు ₹8L చొప్పున ఫైన్ విధించింది. తాను కేవలం ఒక్క ఇంటర్వ్యూకు హాజరైతే క్రెడిట్‌ను దీక్షంత్ సంస్థ తమ ఖాతాలో వేసుకుందని 2021లో సివిల్స్ విజేత మణిశుక్లా ఫిర్యాదు చేశారు. అలాగే తన అనుమతి లేకుండా ఫొటో వాడిందంటూ అభిమను అకాడమీపై నటాష ఫిర్యాదు చేశారు.


