News November 5, 2024

కరీనా ‘దైరా’ చిత్రంలో పృథ్వీరాజ్?

image

మేఘనా గుల్జార్ డైరెక్షన్‌లో కరీనా కపూర్ నటిస్తున్న ‘దైరా’ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన కనిపిస్తారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కాల్‌షీట్లు లేకపోవడంతో ఈ చిత్రం నుంచి ఆయుష్మాన్ ఖురానా, సిద్ధార్థ్ మల్హోత్రా తప్పుకున్నారు.

Similar News

News February 2, 2026

హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు

image

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.77 లక్షల కోట్లు కేటాయించడంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాల దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే, ప్రయాణికుల భద్రత కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఏడు హైస్పీడ్ కారిడార్ల అభివృద్ధి వల్ల రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 2, 2026

ఇండియన్ నేవీలో 260 పోస్టులు

image

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు. అర్హులు FEB-24 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in చూడండి.

News February 2, 2026

రాష్ట్ర ప్రగతికి చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్: పవన్

image

AP: కేంద్ర బడ్జెట్ ఫలాలు ఏపీ ప్రగతికి దోహదం చేసేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగ ప్రోత్సాహకాలు అరకు అభివృద్ధికి, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ రాష్ట్ర తీర ప్రాంత పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం ఇస్తుందన్నారు. బడ్జెట్‌లో కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో కోనసీమ కొబ్బరి రైతులకు, ఉత్తరాంధ్ర జీడి రైతులకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.