News November 5, 2024

BREAKING: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత

image

AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తన స్వగ్రామం అనకాపల్లి జిల్లా పెదగోగాడలో ఇవాళ మరణించారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. NTR హయాంలో మంత్రిగా పనిచేశారు. TTD బోర్డు మెంబర్‌గా కూడా ఆయన సేవలందించారు. కాగా మంత్రిగా కొనసాగుతున్నప్పుడు కూడా ఆయన నిరాడంబర జీవితం గడిపారు. RTC బస్సుల్లోనే ఆయన ప్రయాణించేవారు.

Similar News

News January 31, 2026

సిట్ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన <<19005122>>నోటీసులపై<<>> హైకోర్టుకు వెళ్లాలని మాజీ సీఎం KCR యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్ నోటీసులను సవాలు చేస్తూ ఈరోజు హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం (FEB 1) మ.3 గంటలకు నంది నగర్ నివాసంలో విచారిస్తామని కేసీఆర్‌కు సిట్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిిందే. ఎర్రవెల్లిలోనే విచారించాలన్న ఆయన అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు.

News January 31, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 31, 2026

రష్యాపై US నిఘా.. బయటకొచ్చిన JUMPSEAT వివరాలు

image

కోల్డ్ వార్ కాలం నాటి తన అత్యంత రహస్య నిఘా కార్యక్రమం ‘JUMPSEAT’ వివరాలను అమెరికా తాజాగా బహిర్గతం చేసింది. ఇందులో భాగంగా 1971-1987 మధ్య ప్రయోగించిన 8 ఉపగ్రహాలు 2006 వరకు పనిచేశాయి. ‘మోల్నియా’ కక్ష్యలో ప్రయాణిస్తూ సోవియట్ యూనియన్ క్షిపణులు, సైనిక సమాచారాన్ని ఇవి సేకరించేవి. సోవియట్ భూభాగంపై ఎక్కువ సమయం నిఘా ఉంచే వీలు కలిగేది. ఈ ప్రాజెక్ట్ ఆధునిక అంతరిక్ష నిఘా వ్యవస్థలకు పునాదిగా నిలిచింది.