News November 5, 2024
శ్రీ సత్యసాయి: వేరు కాపురం పెట్టలేదని వివాహిత ఆత్మహత్య
శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతిలో వివాహిత చైత్ర(25) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. భర్త ప్రేమ్ కుమార్‌తో వేరు కాపురం పెట్టాలని మృతురాలు ఒత్తిడి తెచ్చారు. కొద్ది రోజులు ఆగాలని చెప్పినా వినకుండా క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 13, 2025
BREAKING: తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి
తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. రోహిత్ 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.
News January 13, 2025
అనంతపురానికి CM అన్యాయం చేస్తున్నారు: తోపుదుర్తి
కుప్పం ప్రజలకు నీరు ఇవ్వడానికి CM చంద్రబాబు అనంతపురం జిల్లా ప్రజల కడపుకొడుతున్నారని రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘కుప్పానికి నీళ్లు తరలించడానికి అనంతపురం జిల్లా పరిధిలో హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. 5లక్షల ఎకరాలకు నీరు అందదు. CMకు రాజకీయం తప్ప అనంతపురం ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు’ అని తోపుదుర్తి అన్నారు.
News January 13, 2025
శ్రీ సత్యసాయి: 1,668 మందికి ఉద్యోగాలు
ధర్మవరంలో గురువారం జరిగిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ నియామక పత్రాలు అందజేశారు. 5,120 మంది జాబ్ మేళాకు హాజరు కాగా, 99 కంపెనీల ప్రతినిధులు 1,668 మందిని ఎంపిక చేశారు. వచ్చిన అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని, లక్ష్యాన్ని అధిగమించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ పాల్గొన్నారు.