News November 5, 2024
₹4000+Cr ప్రాఫిట్: 4 ఏళ్లలో తీసుకుంది ఐదుగురినే!
Zerodha టెక్ టీమ్ గత 4 ఏళ్లలో కొత్తగా ఐదుగురినే తీసుకుంది. టీమ్‌సైజ్ 35 మాత్రమే కావడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ₹4000 కోట్లకు పైగా ప్రాఫిట్ ఆర్జిస్తున్న ఈ కంపెనీ ఎక్కువగా AIపై ఆధారపడుతోందని తెలుస్తోంది. ఆర్డర్స్, ట్రాన్జాక్షన్స్ సహా చాలా పనుల్లో హ్యూమన్ ఇంటర్‌ఫియరెన్స్ తక్కువేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ విధానం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ల ఉపాధికి గండికొట్టొచ్చన్న భయాలూ పెరుగుతున్నాయి.
Similar News
News November 5, 2024
YCPకి మరో షాక్.. టీడీపీలోకి కుప్పం మున్సిపల్ ఛైర్మన్
AP: వైసీపీకి మరో షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా అంతకుముందు ఆయన వైసీపీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. కాగా గత ఎన్నికల్లో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 25 వార్డులకు గానూ వైసీపీ 19, టీడీపీ 6 చోట్ల గెలిచాయి.
News November 5, 2024
మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ
AP: ఐదేళ్లలో జరిగిన తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టామని DGP ద్వారకా తిరుమలరావు తెలిపారు. ‘గతంలో ఓ పార్టీ ఆఫీసుపై దాడి జరిగితే ఒక్కరినీ అరెస్టు చేయలేదు. తప్పు జరిగితే 30ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకోవచ్చు’ అని చెప్పారు. మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు.
News November 5, 2024
మిడ్ డే మీల్: ఒక్కో ప్రాంతానికి ఒక్కో మెనూ!
AP: మధ్యాహ్న భోజన పథక స్వరూపాన్ని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే మెనూ ఉండగా, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లకు అనుగుణంగా 4 రకాల మెనూ అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు ఇష్టపడే, పౌష్టికాహారం ఉండేలా <<14428656>>మెనూలను<<>> అధికారులు తయారుచేశారు. మరింత కసరత్తు అనంతరం కొత్త మెనూను డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.