News November 5, 2024

గ్రాడ్యుయేట్లకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్

image

TG: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదు గడువు రేపటితో ముగియనుంది. 2019తో (1.96లక్షలు) పోల్చితే ప్రస్తుతం ఓటరు దరఖాస్తుల సంఖ్య(2.40 లక్షలు) పెరిగింది. అయినా ఇంకా సగం మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈనెల 23న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 30న ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.

Similar News

News February 17, 2026

నీరు ఎక్కువగా తాగితే..

image

కిడ్నీ హెల్త్ నీరు తాగే విధానంపై ఆధారపడి ఉంటుంది. దాహంగా ఉన్నప్పుడే నీరు తాగడం లేదా అతిగా నీరు తాగడం.. రెండూ సరికాదు. తక్కువ తాగితే కిడ్నీలో స్టోన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్లు మొదలైనవి వస్తాయి. అతిగా తాగితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. సోడియమ్, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ తగ్గడమే కాక గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మహిళలు రోజుకు 2.2 లీటర్లు, పురుషులు 3 లీటర్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 17, 2026

గంభీర్‌కు RR బంపరాఫర్: కోచ్ పదవికి గుడ్ బై?

image

టీమ్‌ఇండియా కోచ్ గంభీర్‌కు రాజస్థాన్ రాయల్స్ (RR) అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మెంటార్‌తో పాటు ఫ్రాంచైజీలో CEO, పార్ట్‌నర్‌గా చేరాలని కోరినట్లు ‘దైనిక్ జాగరణ్’ పేర్కొంది. కొత్త ఓనర్లు గంభీర్‌కు 2-3% వాటా ఆఫర్ చేశారట. దీంతో టీమ్ నిర్ణయాల్లో ఆయనకు పూర్తి అధికారం దక్కుతుంది. గౌతీకి 2027 WC వరకు టీమ్‌ఇండియా కోచ్‌గా కొనసాగేందుకు కాంట్రాక్ట్ ఉంది. RR ఆఫర్‌తో ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటారా చూడాలి!

News February 17, 2026

ఇమ్రాన్ కోసం కపిల్, గవాస్కర్ సహా 14 మంది మాజీ క్రికెటర్ల లేఖ

image

జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మంచి సదుపాయాలు, చికిత్స అందించాలని పాక్ ప్రభుత్వానికి 14 మంది మాజీ క్రికెటర్లు ‘అంతర్జాతీయ మాజీ క్రికెట్ కెప్టెన్స్’ పేరిట లేఖ రాశారు. ఇందులో భారత లెజెండ్స్ కపిల్ దేవ్, గవాస్కర్ కూడా ఉన్నారు. అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించిందని, కుడి కన్ను 85% చూపు కోల్పోయిందని ఇటీవల వార్తలొచ్చాయి. పాక్‌కు 1992 WC అందించిన ఇమ్రాన్, 2018-2022 మధ్య PMగా ఉన్నారు.