News November 5, 2024

సామాన్యులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్!

image

AP: భారీగా పెరిగిన నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరలపై సరకులు అందజేసేందుకు సిద్ధమవుతోంది. లీటర్ పామాయిల్ రూ.110, కేజీ కందిపప్పు రూ.67, అరకేజీ చక్కెర 16 రూపాయలకే అందించాలని మంత్రులు నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నాయుడుతో కూడిన కమిటీ నిర్ణయించింది. రైతు బజార్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2200 రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా సరకులు విక్రయించనుంది.

Similar News

News January 24, 2026

బాలికలను ఎగరనిద్దాం..

image

అమ్మాయిలు ప్రస్తుతం యుద్ధ విమానాలు నడపడం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ తన ముద్ర వేస్తోంది. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. బాలికలకు సమాన అవకాశాలను ప్రోత్సహించడం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందుబాటులో ఉండేలా చూడటం ప్రధాన ఉద్దేశ్యం. కేవలం సమస్యల గురించే కాకుండా బాలికలు సాధిస్తున్న అద్భుత విజయాలను వేడుకగా జరుపుకోవడం కూడా ఇందులో భాగం.

News January 24, 2026

రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి: CBN

image

AP: రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని CM చంద్రబాబు చెప్పారు. ‘ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేశాం. చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశాం. పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు’ అని నగరిలో నిర్వహించిన ప్రజావేదికలో పేర్కొన్నారు.

News January 24, 2026

KTRను నేరస్థుడిగా పరిగణించలేదు: జూపల్లి

image

TG: ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దర్యాప్తు జరుగుతోందని, కేటీఆర్‌కు CRPC 160 కింద నోటీసులు ఇచ్చారని తెలిపారు. కేటీఆర్‌ను నేరస్థుడిగా పరిగణించలేదని, సాక్షిగా సమాచారం కోసమే విచారణకు పిలిచారని తెలిపారు. ప్రభుత్వానిది రాజకీయ కక్ష అనడం సరికాదని, కేసులో పాత్రధారులు, సూత్రధారులు తేలాలని పేర్కొన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.