News November 5, 2024

విజయవాడ: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. గతంలో ప్రకటించిన గడువు ప్రకారం అపరాధ రుసుము లేకుండా అక్టోబరు 28కి ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ గడువును ఈ నెల 18 వరకు పెంచుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదేశాలు జారీచేశారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు రూ.200 అపరాధ రుసుముతో చెల్లించవచ్చు అన్నారు.

Similar News

News November 22, 2024

విజయవాడలో తీవ్ర విషాదం

image

విజయవాడ నగర శివారులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. జక్కంపూడి పోలవరం పట్టిసీమ కాలవ సమీపంలో ఘటన జరిగింది. విజయవాడకి చెందిన ఆరుగురు యువకులు గురువారం పట్టిసీమ కాలంలో స్నానానికి దిగగా ఇద్దరు గల్లంతు కాగా నలుగురు యువకులు సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతయిన వారు విజయవాడ సింగ్ నగర్‌కు చెందిన మునీర్ శివతేజగా గుర్తించినట్లు సీఐ కొండలరావు తెలిపారు. 

News November 22, 2024

YV సుబ్బారెడ్డికి కృష్ణా జిల్లా బాధ్యతలు

image

వైవీ సుబ్బారెడ్డి వైసీపీ అధిష్ఠానం గురువారం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా రీజనల్-కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయనకు ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యతలు కూడా అప్పగించింది. ఈ మేరకు కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

News November 22, 2024

నేడే పీఏసీ ఛైర్మన్ ఎన్నిక.. నామినేషన్ వేసిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యే

image

శాసనసభలో శుక్రవారం జరగనున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఎన్నికకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నామినేషన్ వేశారు. కాగా తాతయ్యతో పాటు NDA కూటమి నుంచి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ సమర్పించారు. ఛైర్మన్‌తో పాటు PACలో మొత్తం 9 మంది సభ్యులను నేడు శాసనసభలో స్పీకర్ అయ్యన్న సమక్షంలో సభ్యులు ఎన్నుకుంటారు.