News November 5, 2024

US Elections: అతనొక్కడే ఏకగ్రీవం

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఒకే ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి జార్జ్ వాషింగ్టన్ 1789లో ఏకగ్రీవంగా ఎన్నికై USకు తొలి అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పటివరకు 46 మంది అధ్యక్షులుగా పనిచేయగా, వాషింగ్టన్ తప్ప అందరూ ఎన్నికలు ఎదుర్కొన్నవారే. FD రూస్‌వెల్ట్ అధ్యక్షుడిగా 4సార్లు ఎన్నికయ్యారు. పదవిలో ఉండగానే ఆయన మరణించడంతో ఆపై ఎవరూ 2సార్లకు మించి అధ్యక్షుడు కాకుండా రాజ్యాంగ సవరణ చేశారు.

Similar News

News January 10, 2026

సంక్రాంతి సెలవులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

సంక్రాంతి అనగానే అంతా సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఇళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. క్యాష్, నగలు ఉంటే బ్యాంక్ లాకర్లలో దాచుకోండి. మీరు ఊరు వెళ్తున్న విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయండి. మీ ట్రావెల్‌కు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేయకండి. మీ ఇంటి దగ్గర పరిస్థితిపై మీకేమైనా అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి కాల్ చేయండి.

News January 10, 2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన

image

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది.

News January 10, 2026

సినిమా టికెట్లేనా.. స్కూల్ ఫీజులు, ఆస్పత్రుల దోపిడీ సంగతేంటి?

image

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్ల పెంపు, కోర్టుల్లో కేసులు, వివాదాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే భారీగా ఉన్న స్కూల్ ఫీజులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బిల్లులు, రవాణా ఛార్జీలు తగ్గించాలని ఎవరూ ఎందుకు అడగట్లేదని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీటి వల్ల ఎక్కువ మందిపై భారం పడుతోందని, సినిమా టికెట్ల కంటే వీటిపై చర్చ ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ COMMENT?