News November 5, 2024
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీన్ రిపీట్

తమిళనాడులోని మింజూర్ రైల్వేస్టేషన్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ సీన్ రిపీటైంది. నెల్లూరుకు చెందిన తండ్రీ కూతురు.. సుబ్రహ్మణ్యం, దివ్యశ్రీ ఓ మహిళను చంపి సూట్‌కేసులో కుక్కి రైల్వేస్టేషన్‌లో విసిరేశారు. దీనిని ఓ కానిస్టేబుల్ గుర్తించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీలో కూడా ఇలాగే కొంతమందిని హత్య చేసి సూట్‌కేసుల్లో కుక్కి పట్టాల పక్కన పడేసేవారు.
Similar News
News January 14, 2026
ఇరాన్‌పై అమెరికా ఎందుకు అటాక్ చేయట్లేదంటే..

ఇరాన్ పాలకులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మండిపడుతున్నారు కానీ మిలిటరీ అటాక్ చేయట్లేదు. దీనికి ముఖ్య కారణం.. OCT నుంచి మిడిల్ ఈస్ట్‌లో US ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేకపోవడమే. ఏదైనా మిస్సైల్, ఎయిర్ అటాక్ చేయాలంటే ఖతర్, బహ్రెయిన్, ఇరాక్, సౌదీ, యూఏఈలోని బేస్‌లను వాడుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది కాబట్టి అందుకు ఆ దేశాలు ఒప్పుకోవు. ఒకవేళ B2 బాంబర్లు వాడితే భారీగా పౌరులు మరణిస్తారు.
News January 14, 2026
గొంతులు కోసిన చైనా మంజా.. ఇద్దరి మృతి

వేర్వేరు ఘటనల్లో చైనా మాంజా ఇద్దరి ప్రాణాలు తీసింది. తెలంగాణలోని సంగారెడ్డి(D) ఫసల్వాదిలో బిహార్‌కు చెందిన వలస కార్మికుడు బైక్‌పై వెళ్తుండగా మాంజా గొంతుకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో సంజూకుమార్ అనే వ్యక్తి ఇదే తరహా ఘటనలో మరణించాడు. కాగా చైనా మాంజా వినియోగం, విక్రయాలపై నిషేధం ఉన్నా అమ్మకాలు కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది.
News January 14, 2026
ఢిల్లీ కాలుష్యం.. తప్పుకున్న వరల్డ్ నం.3

ఢిల్లీలో కాలుష్యం ఆటలపై ప్రభావం చూపిస్తోంది. తీవ్రమైన కాలుష్యం కారణంగా ‘ఇండియా ఓపెన్’ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వరల్డ్ నం.3, డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటన్సెన్ ప్రకటించారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహణకు ఇది సరైన వేదిక కాదని చెప్పారు. దీంతో ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 5వేల డాలర్ల ఫైన్ చెల్లించారు. కాగా ‘ఇండియా ఓపెన్’ నుంచి ఆండర్స్ తప్పుకోవడం ఇది వరుసగా మూడోసారి.


