News November 5, 2024

కన్వీనియెన్స్‌తో కష్టం గురూ!

image

అతి సర్వత్ర వర్జయేత్! టెక్నాలజీతో మానవ జీవితం మారిపోయింది. శ్రమ తగ్గింది. కన్వీనియెన్స్ పెరిగింది. మరీ ఎక్కువ కన్వీనియెన్స్ మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది మన బేసిక్ ఇన్‌స్టింక్ట్స్‌ను మార్చేస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. EX. పిక్నిక్ వెళ్లినప్పుడు పులి ఎదురైతే అక్కడ్నుంచి పారిపోవడం మానవ నైజం. లేదు అదే వెళ్లిపోతుందిలే అని సెల్ఫీ దిగడం లేజీనెస్. కన్వీనియెన్స్‌తో వచ్చే ప్రమాదాలు ఇలాంటివే.

Similar News

News December 26, 2025

ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 150 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

<>రాయ్‌పుర్‌లోని<<>> ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ 150 పోస్టులకు అప్లైకి గడువును పొడిగించింది. దరఖాస్తుకు DEC 27 ఆఖరు తేదీ కాగా.. JAN 16వరకు పెంచింది. పోస్టులను బట్టి టెన్త్+NTC/నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన వారు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 18 -32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ddpdoo.gov.in/

News December 26, 2025

మోహన్‌లాల్ సినిమాకు తొలి రోజు ₹70 లక్షలే!

image

మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘వృషభ’ సినిమా తొలిరోజు షాకింగ్ కలెక్షన్లు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ₹70 లక్షల వసూళ్లు మాత్రమే సాధించింది. మలయాళంలో ₹46 లక్షలు, తెలుగులో ₹13 లక్షలు, హిందీలో ₹2 లక్షలే వచ్చాయి. ఎపిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అంచనాలను అందుకోలేదు. మోహన్‌లాల్ నటన ఆకట్టుకున్నా, కంటెంట్ బాగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా ఈ సినిమా బడ్జెట్ ₹70 కోట్లకు పైనే కావడం గమనార్హం.

News December 26, 2025

కష్టాల్లో ఆస్ట్రేలియా.. 6 వికెట్లు డౌన్

image

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ప్లేయర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో ఆస్ట్రేలియా 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జోష్ టంగ్ 3, అట్కిన్‌సన్ 2, స్టోక్స్ ఒక వికెట్ తీశారు. తొలి 3 టెస్టుల్లో ఓడిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది.