News November 5, 2024

2025 సమ్మర్‌ బరిలో రజినీకాంత్ ‘కూలీ’

image

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 2025 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని డైరెక్టర్ ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శివ కార్తికేయన్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Similar News

News February 5, 2026

బంధంలో ఇది ముఖ్యం

image

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

News February 5, 2026

గొడవలు ఎందుకొస్తాయంటే?

image

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే గొడవలు రావడానికి కారణం కమ్యునికేషన్ లేకపోవడం. సరైన సంభాషణ జరగనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం కూడా కలుగుతుంది. అలానే ఒకరి భావాలు మరొకరికి తప్పుగా అర్థం అవుతాయి. కాబట్టి కమ్యునికేషన్ బావుండేలా చూసుకోవడం మంచిది. ఇలా కూడా సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. సరిగ్గా మాట్లాడడం, ఓపెన్‌గా మాట్లాడడటం వల్ల గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

News February 5, 2026

JIPMERలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్& రీసెర్చ్(<>JIPMER<<>>) 10 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM, MD, MCh అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. FEB 24న మెరిట్ లిస్ట్ ప్రకటించి, FEB 27న ఇంటర్వ్యూకు పిలుస్తారు. నెలకు రూ.1,42,506 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://jipmer.edu.in