News November 5, 2024
పత్తిలో తేమ శాతం 8-12 మధ్య ఉండాలి: మంత్రి తుమ్మల

TG: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తిలో తేమ శాతం 8-12 మధ్య ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం కోసం వాట్సాప్ నంబర్ 8897281111ను సంప్రదించాలని చెప్పారు. పత్తి కొనుగోళ్లపై సమీక్షించిన ఆయన, నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 1, 2025
ప్రెగ్నెన్సీలో నిద్రపట్టట్లేదా? ఈ టిప్స్ పాటించండి

నెలలు నిండే కొద్దీ గర్భిణుల్లో నిద్రలేమి పెరుగుతుంది. దీనికోసం కొన్ని చిట్కాలు చెబుతున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో డాక్టర్లు చెబితే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోకూడదు. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. ఇలాకాకుండా రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలి. నిద్రకు ముందు కాళ్లు, చేతులు, తల మసాజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News November 1, 2025
విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు!

TG: ST, BC, మైనార్టీ, EBC విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలు ఉండటంతో కొన్ని కాలేజీలు వారి నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అందిస్తున్న SC విద్యార్థుల తరహాలో మిగతా వారికీ అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఏటా 12.5 లక్షల మంది స్టూడెంట్స్‌కు సర్కార్ రూ.2,600Cr వెచ్చిస్తోంది.
News November 1, 2025
ఉప్పు వేయడం, వేర్లు నరకడం వల్ల కొబ్బరి దిగుబడి పెరుగుతుందా?

చాలా చోట్ల కొబ్బరి సాగు చేస్తున్న రైతులు చెట్లకు ఉప్పు వేయడం, వేర్లు నరకడం చేస్తుంటారు. దీని వల్ల దిగుబడి పెరుగుతుందని కొందరు చెబుతుంటారు. ఏడాది వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏడాది దిగుబడి కొంత పెరగడం కనిపిస్తుంది. కానీ తర్వాత ఏడాది నుంచి దిగుబడి తగ్గిపోతుంది. అది చెట్టుకు కూడా హాని చేస్తుంది. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అని, దీన్ని పాటించకపోవడం మంచిదని ఉద్యాన పరిశోధనా నిపుణులు చెబుతున్నారు.


