News November 5, 2024
ఈ 6 నగరాల్లో ‘పుష్ప-2’ ప్రమోషన్స్?

భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోన్న ‘పుష్ప-2’ సినిమా ప్రమోషనల్ టూర్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. మిడ్ నవంబర్‌లో ట్రైలర్ ఈవెంట్ సహా 6 నగరాల్లో మూవీ టీమ్ ప్రోమోషన్స్‌లో పాల్గొంటుందని సినీ వర్గాలు తెలిపాయి. పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో అల్లు అర్జున్ సందడి చేయనున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News July 5, 2025
ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి

TG: మహిళలకు ఐదేళ్లలో ₹లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు ఈనెల 12 నుంచి 18 వరకు వడ్డీ లేని రుణాల నగదును చెక్కుల రూపంలో పంపిణీ చేస్తామన్నారు. ప్రతి ఏటా 20 వేల కోట్లకు తగ్గకుండా లోన్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించేందుకు సమాఖ్య సమావేశాలు నిర్వహించుకోవాలని మహిళా సంఘాలకు సూచించారు.
News July 5, 2025
అనుష్క ‘ఘాటీ’ విడుదల వాయిదా

అనుష్క, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘాటీ’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 11న విడుదల చేస్తామని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించగా, పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. ప్రేక్షకులకు మరింత ఉత్తమ సినిమాటిక్ అనుభవాన్ని పంచేందుకు సినిమాను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామంది.
News July 5, 2025
PNB కేసు.. నీరవ్ మోదీ సోదరుడు అరెస్ట్

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)ను రూ.14వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.