News November 5, 2024
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉంది?
డుగ్.. డుగ్ అని సౌండ్ చేస్తూ రోడ్డుపై వెళ్తోన్న వారి చూపును అట్రాక్ట్ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను లాంఛ్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో లాంఛ్ అయిన ఈ బైక్ 2026లో అందుబాటులోకి రానుంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం వాడిన ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీ బైక్ నుంచి ప్రేరణ పొందింది. ఇంజిన్ ఉండే చోట బ్యాటరీని ఉంచారంతే. 100 KM రైడింగ్ రేంజ్ ఉండొచ్చు.
Similar News
News December 27, 2024
నిజాయితీ, నిరాడంబరతే మన్మోహన్ కిరీటాలు
మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎంతో నిజాయితీ, నిరాడంబర జీవితాన్ని గడిపారు. మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రత్యర్థుల మన్ననలు సైతం పొందారు. ప్రజా జీవితంలో పాటించాల్సిన విలువలకు ఆయన నిదర్శనంగా నిలిచారు. ఎవరిపైనా చిన్న దూషణ, తప్పుడు ఆరోపణలు చేయలేదు. ఆర్థిక, పాలనా అంశాల్లో సమగ్రమైన అవగాహనతో ఆయన పార్లమెంట్ సహా పలు వేదికల్లో చేసిన ప్రసంగాలు ఎంతో మందికి పాఠ్యపుస్తకాల్లాంటివి.
News December 27, 2024
రుణమాఫీకి ఆద్యుడు మన్మోహన్
ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రైతు రుణమాఫీ అనేది కామన్ హామీగా మారిపోయింది. అయితే ఈ పథకానికి ఆద్యుడు మన్మోహన్ సింగ్. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు రూ.72,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఆ డేరింగ్ నిర్ణయం కారణంగానే యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుస్తున్నాయి.
News December 27, 2024
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నేడు వైసీపీ పోరుబాట
AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.