News November 5, 2024

కొన్ని రోజులు ఢిల్లీలో ఉండండ‌ని మీరే అంటారు: ప‌్రియాంకా గాంధీ

image

వ‌య‌నాడ్‌లో ప్రియాంకా గాంధీ గెలిస్తే తరువాత నియోజకవర్గంలో పెద్దగా కనిపించరని వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఆమె కొట్టిపారేశారు. తన కుమారుడు బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న‌ప్పుడు అతణ్ని చూసేందుకు నిత్యం వెళ్లేదాన్నని, అయితే కొన్ని రోజులకు రావడం తగ్గించండని ప్రిన్సిపల్ కోరారని తెలిపారు. ఆ ప్రిన్సిపల్ మాదిరిగానే ఇక్కడికి రావడం త‌గ్గించి ఢిల్లీలో ఉండండని వయనాడ్ ప్రజలు చెప్పే రోజు వ‌స్తుందన్నారు.

Similar News

News November 5, 2024

జగన్.. ఐదేళ్లలో నువ్వేం చేశావ్?: మంత్రి అనిత

image

AP: ఇప్పుడు లా&ఆర్డర్ గురించి మాట్లాడుతున్న జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు వైసీపీ పాపాలే కారణమన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. వాస్తవాలను కాకుండా జగన్ సైకో బ్యాచ్‌ సోషల్ మీడియాలో తమపై బురదజల్లుతూ, జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు.

News November 5, 2024

ట్రంప్ గెలిస్తే నిజంగానే ‘పెద్ద‌’న్న అవుతారు!

image

అమెరికా ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ విజ‌యం సాధిస్తే అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అధిక వ‌య‌స్కుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలువనున్నారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బైడెన్ వ‌య‌సు 81 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నాటి వ‌య‌సుతో పోల్చితే ట్రంప్ వ‌య‌సు ఐదు నెల‌లు అధికం. ఈ లెక్క‌న ట్రంప్ గెలిస్తే అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేసే పెద్ద‌ వ‌య‌స్కుడిగా (78 ఏళ్ల నాలుగు నెలలు) చ‌రిత్ర సృష్టిస్తారు.

News November 5, 2024

తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్: రాహుల్

image

TG: తెలంగాణలో చేసే కులగణన ప్రక్రియ దేశానికి రోల్ మోడల్ అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో కుల వివక్ష ఉందని, అది అగ్రకులాలకు ఎప్పుడూ కనిపించదని తెలిపారు. ఇదే విషయం తాను చెబితే దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తారని వ్యాఖ్యానించారు. అందులో నిజాన్ని పరిశీలించాలని, వాస్తవాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్లాలని రాహుల్ కోరారు.