News November 5, 2024

US Elections: డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం

image

న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో పోలింగ్ ముగిసింది. తొలి ఫ‌లితం కూడా వ‌చ్చేసింది. అర్హులైన ఓటర్లు అతిత‌క్కువగా ఉండే ఈ ప్రాంతంలో 1960 నుంచి మిగిలిన రాష్ట్రాల కంటే ముందే పోలింగ్ జ‌రుగుతోంది. ఈ ఫ‌లితాల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌న‌కు చెరో మూడు చొప్పున బ్యాలెట్ ఓట్లు ద‌క్కాయి. యూఎస్-కెనడా సరిహద్దులోని ఈ పట్టణ ప్రజలు గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చారు.

Similar News

News September 16, 2025

75% హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతి

image

CBSE విద్యార్థులు టెన్త్, 12వ తరగతి పరీక్షలు రాయాలంటే 75% హాజరు ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఫలితాల వెల్లడికి ఇంటర్నల్ అసెస్‌మెంట్ తప్పనిసరి. అయితే హాజరు శాతం తక్కువగా ఉంటే అసెస్‌మెంట్ సాధ్యం కావట్లేదని బోర్డు పేర్కొంది. దీంతో కఠినంగా 75% హాజరు నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా హాజరుశాతం, క్లాస్‌రూం యాక్టివిటీస్ పెరుగుతాయని భావిస్తోంది.

News September 16, 2025

సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం

image

డిగ్రీ, PG, మెడిసిన్, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్ పేరుతో కేంద్రం స్కాలర్‌షిప్ అందిస్తోంది. డిగ్రీ విద్యార్థులకు ఏటా రూ.12వేల చొప్పున మూడేళ్ల వరకు, PG విద్యార్థులకు రూ.20వేల చొప్పున రెండేళ్ల వరకు అందిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31. వెబ్‌సైట్: https://scholarships.gov.in/

News September 16, 2025

CLAT-2026కు దరఖాస్తు చేశారా?

image

జాతీయ స్థాయిలో న్యాయవిద్య కోసం CLAT-2026కు దరఖాస్తులు కోరుతున్నారు. నేషనల్ లా యూనివర్సిటీల్లో UG, PG కోర్సుల్లో ప్రవేశాలకు OCT-31వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 4000, SC, ST, దివ్యాంగులు రూ. 3,500 చెల్లించాల్సి ఉంటుంది. DEC 7న పరీక్ష నిర్వహించనున్నారు. UG కోర్సులకు ఇంటర్, PG కోర్సులకు LLB డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.