News November 5, 2024
భారత్ బ్రాండ్: రూ.30కే గోధుమ పిండి, రూ.34కే బియ్యం

కేంద్రం భారత్ బ్రాండ్ రెండో దశను ఆవిష్కరించింది. కాస్త ధరలు పెంచి రూ.30కే కేజీ గోధుమ పిండి, రూ.34కే KG బియ్యం వినియోగదారులకు ఇవ్వనుంది. 5-10 KGల బ్యాగులను NCCF, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మనుంది. వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు దీనిని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఫేజ్-1లో రూ.27.50కే కేజీ గోధుమ పిండి, రూ.29కే కిలో బియ్యం అందించింది.
Similar News
News January 16, 2026
4 రోజుల్లో రూ.190 కోట్ల కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీసు వద్ద రప్ఫాడిస్తోంది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.190కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. బుక్ మై షోలో 2మిలియన్లకు పైగా టికెట్లు సోల్డ్ అయినట్లు పేర్కొంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా, వెంకటేశ్ గెస్ట్ రోల్లో నటించిన సంగతి తెలిసిందే.
News January 16, 2026
ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. వివిధ పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు తమకు కోపం, భయం, బాధ వస్తే వాటిని లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్టులు. ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని, అలా కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.
News January 16, 2026
కనుమ రోజున ఆవులను ఎందుకు పూజించాలి?

మన ధర్మశాస్త్రాల ప్రకారం ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు. అందుకే గోపూజ చేస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. ఆవు పృష్ఠ భాగంలో మహాలక్ష్మి నివసిస్తుందని నమ్మకం. అందుకే కనుమ నాడు గోవును పూజిస్తే దారిద్య్రం తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని, గ్రహ దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని విశ్వాసం.


