News November 5, 2024
రెండేళ్ల బిడ్డ కోసం 43 ఏళ్లుగా వెతుకులాట!

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల కూతురు కాట్రిస్ లీ 43 ఏళ్ల క్రితం జర్మనీలోని బ్రిటిష్ మిలిటరీ సూపర్ మార్కెట్లో తప్పిపోయింది. ఇప్పటికీ ఆమె జాడ కోసం తండ్రి ఆర్మీ వెటరన్ రిచర్డ్ వెతుకుతూనే ఉన్నారు. ప్రతి ఏటా కాట్రిస్ తప్పిపోయిన ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. పోలీసులు సైతం వారికి హెల్ప్ చేస్తున్నారు. రిచర్డ్‌కు 75 ఏళ్లు కాగా తాను చనిపోయేవరకూ బిడ్డ కోసం వెతకడం ఆపనని ఆయన చెబుతున్నారు.
Similar News
News July 7, 2025
అప్పట్లో ఆశా పేరు చెబితే నోరు ఊరేది!!

ఇవాళ <<16972254>>చాక్లెట్<<>> అంటే కోకొల్లల పేర్లు, రుచులు. కానీ రీల్‌ను 20 ఏళ్లు వెనక్కి తిప్పితే ఆశా పేరుతో లిస్ట్ ఆరంభం. ఆశా, మ్యాంగో బైట్, కాఫీ బైట్, న్యూట్రిన్, ఆల్పెన్లిబి, చింతపండు చాక్లెట్ వంటివే ట్రెండ్. నిజానికి వీటిలో చాలా వరకు క్యాండీలు, టాఫీలు.. కానీ అప్పుడవే మన చాక్లెట్స్. అవి నోటిని తాకితే వచ్చే ఫీల్, కొనేందుకు డబ్బుల కోసం ఇంట్లో మన పోరాటం నేటికీ ఓ స్వీట్ మెమొరీ. మీ ఫెవరెట్ చాక్లెట్ ఏది? కామెంట్.
News July 7, 2025
ఇవాళ టారిఫ్ లెటర్స్ పంపిస్తాం: ట్రంప్

వివిధ దేశాలకు తాము ఇవాళ మ.12 గంటలకు (9:30 PM IST) టారిఫ్ లెటర్స్ పంపనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. BRICS అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు తెలిపే ఏ దేశానికైనా అదనంగా 10% సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపారు. ఈ కొత్త టారిఫ్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుత్నిక్ పేర్కొన్నారు.
News July 7, 2025
శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. జూరాల, సుంకేశుల నుంచి 1.98 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 59వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 880.40 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 190.33 TMCలుగా ఉంది. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.