News November 5, 2024

కాకాణితో సమావేశమైన ఎమ్మెల్సీ చంద్రశేఖర్

image

నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి నివాసంలో గురువారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. వారు పలు అంశాలపై చర్చించారు. కాకాణి గోవర్దన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జిల్లాలోనే పలువురు నాయకులు పాల్గొన్నారు.

Similar News

News April 5, 2026

కావలిలో వందే భారత్ రైలు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

image

పలుకూరి చిన్నమ్మ(75) భర్తతో కలిసి విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలులో వచ్చి కావలి స్టేషన్‌లో దిగింది. కావలి నుంచి తూర్పు వైపు వైకుంటపురానికి వెళ్లేక్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా విజయవాడకు వెళ్తున్న వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి GRP ఎస్ఐ వెంకట్రావు దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2026

NLR: ‘ఫేస్ వాష్ అండ్ గో’తో ప్రమాదాలకు చెక్

image

నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాత్రిపూట హైవేలపై ప్రయాణించే బస్సులు, లారీ డ్రైవర్లను నిలుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వారి నిద్రమత్తు వదిలించేందుకు ముఖం కడిగిస్తున్నారు.

News April 5, 2026

TDPలోనే ఉంటాం: నెల్లూరు MP

image

జగన్‌ను కలిసే విషయయై YCP రాజ్యసభ MP అయోధ్య రామిరెడ్డితో నెల్లూరు MP వేమిరెడ్డి చర్చించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ‘మాకు కావాల్సింది గౌరవం. TDP ప్రభుత్వంలో చాలా గౌరవంగా ఉన్నాం. ఇదే పార్టీలోనే కొనసాగుతాం. రాజధానిపై YCPకి స్పష్టతలేదు. మావిగన్ అంటే జనాలు నవ్వుతున్నారు. తమిళనాడు బోట్లను అడ్డుకోవడానికి త్వరలో నెల్లూరుకు 2, తిరుపతి, బాపట్లకు ఒక్కోటి చొప్పున బోట్లు ఇస్తాం’ అని వేమిరెడ్డి చెప్పారు.