News November 5, 2024
9న కడప జిల్లాకు CM చంద్రబాబు

ఈనెల 9వ తేదీన కడప జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటకు రానున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలిచాక మొదటిసారి జిల్లాకు రానుండగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
Similar News
News January 18, 2026
కడప జిల్లాతో NTRకు అనుబంధం.. మీకు తెలుసా!

దివంగత నేత NTRకు కడపతో ప్రత్యేక అనుబంధం ఉంది. NTR 1983లో తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారం కోసం చైతన్య రథంలో హరికృష్ణ డ్రైవర్‌గా రోడ్డు షో నిర్వహించారు. ఈ యాత్ర తాళ్ల ప్రొద్దుటూరు, పాతచౌటపల్లి, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కడప మీదుగా సాగింది. పాతచౌటపల్లి చిత్రావతి నదిలో చైతన్య రథం మొరాయించడంతో అక్కడే ఆయన బస చేశారు. తిరిగి 1984లో పులివెందుల, కొండాపురం తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. నేడు NTR వర్ధంతి.
News January 17, 2026
కడప టు ఢిల్లీ

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకొచ్చారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఏపీ నుంచి కూచిపూడి నృత్యానికి సంబంధించి 30 మందిని ఎంపికచేసింది.
News January 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,330
* బంగారం 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,184
* వెండి 10 గ్రాములు ధర రూ.2,810


