News November 5, 2024

బరాక్ ఒబామాకు సిద్ద రామయ్య ఆహ్వానం

image

అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాకు CM సిద్ద రామ‌య్య ప్ర‌త్యేక ఆహ్వానాన్ని పంపారు. 1924లో బెల‌గావిలో జరిగిన 39వ భార‌త జాతీయ కాంగ్రెస్ స‌ద‌స్సు అధ్య‌క్షుడిగా మ‌హాత్మా గాంధీ బాధ్య‌త‌లు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వచ్చే నెల బెలగావిలో శతాబ్ది ఉత్సవాలతోపాటు శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఒబామాను సిద్ద రామయ్య కోరారు.

Similar News

News February 1, 2026

KCRతో కేటీఆర్, హరీశ్ రావు భేటీ

image

TG: సిట్ విచారణ అనంతరం BRS అధినేత KCRతో కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు సహా లాయర్లు భేటీ అయ్యారు. విచారణ జరిగిన తీరు, అధికారుల ప్రశ్నల సరళిపై చర్చిస్తున్నారు. తర్వాత పరిణామాలపై డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు BRS భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు KCR రాకకోసం వేచిచూస్తున్నారు.

News February 1, 2026

సెమీస్‌కు భారత్! పాక్ గెలిచినా ఇంటికే..

image

U19 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని <<19023246>>33.3<<>> ఓవర్లలోపు ఛేదించడంలో పాక్ విఫలమైంది. ఆ సమయానికి కేవలం 167/4 రన్స్ మాత్రమే చేయడంతో రన్‌రేట్ సమీకరణాల ప్రకారం భారత్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. పాకిస్థాన్ జట్టు గెలుపు కోసం పోరాడుతోంది. ఈ మ్యాచ్ పాక్ గెలిస్తే ఇండియా ఎల్లుండి ఆసీస్‌తో, ఓడితే FEB 4న ఆఫ్గాన్‌తో సెమీఫైనల్‌లో తలపడనుంది.

News February 1, 2026

ఫోన్ ట్యాపింగ్‌పై ఆదేశాలు ఇవ్వలేదు: KCR

image

TG: ఫోన్ ట్యాపింగ్‌పై తాను ఆదేశాలు ఇవ్వలేదని KCR సిట్ విచారణలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై GOVTకి నివేదించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్‌కు ఉంటుంది. MLAల కొనుగోలు సమాచారం అలాగే వచ్చింది. అదెలా సేకరించారో CMకు అవసరం లేదు కదా? అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ ఫండ్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదని, ఆ అవసరం పార్టీకి లేదని చెప్పినట్లు తెలిసింది.