News November 6, 2024

లింగంపేట: నాగన్న బావిని పరిశీలించిన కలెక్టర్

image

లింగంపేట మండల కేంద్రంలో ఉన్న నాగన్న బావిని ఇవాళ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నాగన్న బావిని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని, కాటేజీలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. బావిలో ఉన్న చెత్తను తొలగించాలని, సమీపంలో మొక్కలు నాటి సంరక్షించాలని వారు సూచించారు. అనంతరం బావి చూడడానికి వచ్చిన పాఠశాల చిన్నారులతో పురాతన బావి దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు.

Similar News

News September 17, 2025

NZB: ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి అన్నారు. NZBలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.

News September 17, 2025

NZB: జాతీయ పతాకాన్ని ఎగరవేసిన CM సలహాదారు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతిని వివరించారు. కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, CP సాయి చైతన్య, MLAలు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

News September 16, 2025

టీయూ ఎం.ఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్/అక్టోబర్‌-2025లో నిర్వహించనున్న ఎం.ఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు సెప్టెంబర్ 20లోపు ఫీజులు చెల్లించవచ్చని, రూ.100 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 22 వరకు గడువు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు www.telanganauniversity.ac.inను సందర్శించాలని సూచించారు.