News November 6, 2024
అంతరిక్షం నుంచి ఓటేసిన సునీత విలియమ్స్
అమెరికాలో పోలింగ్ సందర్భంగా అంతరిక్షంలో ఉన్న ఆదేశ వ్యోమగాములు అక్కడి నుంచే ఓటేశారు. సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్, డాన్ పెటిట్, నిక్ హాగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు అమెరికా జాతీయ జెండాలు కలిగిన సాక్స్‌లు వేసుకొని ‘అమెరికన్లుగా గర్వపడుతున్నాం’ అని సందేశం పంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వ్యోమగాములు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Similar News
News November 6, 2024
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా జోస్ ఇంగ్లిస్
ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్‌ను సీఏ నియమించింది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ గైర్హాజరీ నేపథ్యంలో ఆయన సారథ్య బాధ్యతలు అందుకున్నారు. అలాగే కమిన్స్, స్మిత్, హేజిల్‌వుడ్‌కు రెస్ట్ ఇవ్వడంతో పాక్‌తో జరగబోయే మూడో వన్డేకు కూడా ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. కాగా ఇంగ్లిస్ ఇప్పటివరకు 26 అంతర్జాతీయ టీ20లే ఆడారు. 100 మ్యాచులు ఆడిన సీనియర్లను కాదని ఆయనను సారథిగా నియమించారు.
News November 6, 2024
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో భూఆక్రమణల నిరోధక చట్టం-1982 రద్దు ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ప్రొహిబిషన్ బిల్లు-2024కు ఆమోదం పలుకుతుందని సమాచారం. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన పనుల గురించి చర్చించే ఛాన్స్ ఉంది.
News November 6, 2024
దూసుకెళ్తున్న ట్రంప్
US అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ‘అసోసియేట్ ప్రెస్’ ప్రకారం ఆయన ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేశారు. అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ 30 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. మొత్తంగా ఆయన ఖాతాలో 95 ఓట్లు చేరాయి. కమల 5 రాష్ట్రాల్లో గెలుపొంది 35 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. 40 ఓట్లున్న టెక్సాస్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.