News November 6, 2024
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నటి భర్త
నటి స్వర భాస్కర్ భర్త ఫాహద్ అహ్మద్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ముంబైలోని అనుశక్తి నగర్ నుంచి ఆయన NCP-SP తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న ఆయన ఇటీవలే NCP-SPలో చేరారు. ఎన్నికల్లో ప్రచారం కోసం తన భర్త క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసినట్లు స్వర ట్వీట్ చేశారు. అతడికి మద్దతుగా నిలిచి విరాళాలు అందించాలని అభ్యర్థించారు. గతేడాది అహ్మద్‌ను స్వర పెళ్లి చేసుకున్నారు.
Similar News
News November 6, 2024
ఏపీలో మైనర్ బాలికపై అత్యాచారం
APలో మరో ఘోరం జరిగింది. నెల్లూరు నగరంలో రీల్స్ పేరుతో బాలిక(14)ను మభ్యపెట్టి ఆటోడ్రైవర్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి, ఇతర బంధువులు ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై నవాబుపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
News November 6, 2024
IPL: రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్ ఆటగాళ్లు వీరే
ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో కొందరు విదేశీ స్టార్ ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ప్రకటించుకున్నారు. వీరిలో వార్నర్, స్టార్క్, స్టీవ్ స్మిత్, స్టొయినిస్, బెయిర్‌స్టో, జంపా, అట్కిన్‌సన్, బట్లర్, రబాడ, మ్యాక్స్‌వెల్, విలియమ్సన్, మార్క్ వుడ్, ఆర్చర్, మార్ష్, జంపా తదితరులు ఉన్నారు. వీరిలో ఎవరు అత్యధిక ధర పలుకుతారో కామెంట్ చేయండి.
News November 6, 2024
సర్వేలో ‘స్పెషల్ కాలమ్’ విజ్ఞప్తిని పరిశీలించండి: హైకోర్టు
TG: సమగ్ర కుటుంబ సర్వేలో వినియోగించే ఫారాల్లో కులం, మతం వెల్లడించని వారి వివరాల నమోదుకు ప్రత్యేక కాలమ్స్ ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులేంటో తెలియజేయాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. రాజ్యాంగంలోని అధికరణ 25(1) ప్రకారం నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొంది. దీనిపై పిటిషనర్ విజ్ఞప్తిని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలంది. విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది.