News November 6, 2024
రాష్ట్రంలో చంద్రన్న దోపిడీ పథకాలు: విజయసాయి రెడ్డి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రన్న దోపిడి పథకాలను అమలు చేస్తున్నట్లు వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శించారు. చంద్రన్న ఇసుక దోపిడి పథకం, చంద్రన్న మద్యం దోపిడి, చంద్రన్న విద్యుత్ దోపిడి, చంద్రన్న పింఛన్ల కోత పథకం, చంద్రన్న దీపం అర్హుల కోత పథకం, చంద్రన్న డూపర్ సిక్స్ పథకం, చంద్రన్న ఖనిజ దోపిడీ పథకాలను అమలు చేస్తుందని ధ్వజమెత్తారు.
Similar News
News December 27, 2024
విశాఖ: ‘నాలుగు రోజులు బ్యాంకు సేవలు నిలిపివేత’
భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఏపీజీవీబీ ఆంధ్రా, తెలంగాణ విభాగాల విభజన దృష్ట్యా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ ఎస్.సతీశ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. జనవరి ఒకటి నుంచి బ్యాంకు సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
News December 27, 2024
కులగణనపై సచివాలయాల పరిధిలో సామాజిక సర్వే: విశాఖ జేసీ
జిల్లాలో చేపట్టిన కులగణనను పారదర్శకంగా చేపట్టాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారుల ఆదేశించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాలపై సమీక్ష చేసేందుకు, పథకాలు అమలు చేసేందుకు, మెరుగైన పాలసీ రూపకల్పన కోసం నిర్వహించిన కులగణనపై గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సామాజిక సర్వే(సోషల్ ఆడిట్)ను చేపడుతున్నట్లు వెల్లడించారు.
News December 26, 2024
విశాఖ: కూటమిలో ఆడారి ఇముడుతారా?
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ బీజేపీలో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. ఇదే ప్రాంతానికి చెందిన స్పీకర్ అయ్యన్న సైతం వారి ఆరోపణలకు ఏకీభవించి విచారణకు ఆదేశించారు. దీంతో ఆడారి టీడీపీలో చేరాలని ప్రయత్నించగా బాహటంగానే ఆ పార్టీ నేతలు వ్యతిరేకించడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.