News November 6, 2024
16,347 టీచర్ పోస్టులు.. నోటిఫికేషన్ వాయిదా
AP: ఇవాళ వెలువడాల్సిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 16,347 టీచర్ పోస్టులతో నేడు మెగా డీఎస్సీ ప్రకటించేందుకు తొలుత ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. మరోవైపు డీఎస్సీని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
Similar News
News November 6, 2024
రోహిత్ శర్మ రిటైర్ కావొచ్చు: శ్రీకాంత్
ఆస్ట్రేలియాతో జరిగే BGTలో విఫలమైతే రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పొచ్చని మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు BCCI ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అతడి వయసు పెరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి. కివీస్ సిరీస్‌లో ఆడలేదని రోహిత్ అంగీకరించడం గ్రేట్. అతను గాడినపడేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ విఫలమైతే అతడే తప్పుకుంటాడు’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
News November 6, 2024
ట్రంప్ గెలిస్తే.. పాలనలో జోక్యంపై మస్క్ హింట్
డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ప్రభుత్వ పాలనలో ఆయనకు సాయపడతానని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. ఫెడరల్ ఏజెన్సీల సంఖ్యను కుదిస్తానని పేర్కొన్నారు. ‘మన బ్యూరోక్రసీ చాలా పెద్దది. పైగా మన దేశంలో నియంత్రణలు ఎక్కువ. వాటిని తగ్గించాల్సి ఉంది. అమెరికాను మరింత మెరుగ్గా నిర్మించేవాళ్లకు సాయపడాలి’ అని టక్కర్ కార్ల్‌సన్‌షోలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ కచ్చితంగా గెలుస్తారని మస్క్ నమ్మకంతో ఉన్నారు.
News November 6, 2024
రైల్వే లైన్ల సర్వే కోసం నిధులు
AP: మచిలీపట్నం-రేపల్లె, రేపల్లె-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్ల నిర్మాణాల సర్వే కోసం రైల్వే బోర్డు నిధులు విడుదల చేసింది. మచిలీపట్నం-రేపల్లె మధ్య 45.30KM DPR కోసం ₹1.13 కోట్లు, బాపట్ల-రేపల్లె మధ్య 45.81KM మేర DPRకై రూ.1.15 కోట్లు విడుదలయ్యాయి. ఈ 2 రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే చెన్నై-హౌరా వెళ్లే రైళ్లు విజయవాడ వెళ్లకుండా మచిలీపట్నం మీదుగా రాకపోకలు సాగించవచ్చు. విజయవాడ స్టేషన్‌పై భారం తగ్గుతుంది.